రకుల్ ప్రీత్ సింగ్.. కెరటం సినిమాతో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ టాలీవుడ్లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో అడుగుపెట్టింది. ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ అంటూ ఫస్ట్ సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల మదిలో తిష్ట వేసింది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లింది.
నాగార్జున వంటి సీనియర్ హీరోలతో నటిస్తూనే.. మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి యంగ్ హీరోలతో జతకట్టింది. ఒక దశలో రకుల్ లేని సినిమా కనిపించేది కాదంటే ఈ బ్యూటీ పాపులారిటీ ఏంటో అర్థమైపోతుంది. గత కొన్నాళ్లుగా ఈ భామకు తెలుగులో అవకాశాల్లేవు.
ప్రస్తుతం రకుల్ బాలీవుడ్లో మకారం వేసింది. అక్కడే సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక బీ టౌన్ ప్రేక్షకులు కూడా రకుల్‌ను బాగానే యాక్సెప్ట్ చేశారు. అయితే తెలుగులో మాదిరి కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా బాలీవుడ్లో ఈ బ్యూటీ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది.
ఇక రకుల్ సోషల్ మీడియాలోనూ తన హవా సాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఈ ఈవెంట్లో రకుల్ ధరించిన ఔట్ఫిట్ యమా ట్రెండీగా ఉంది. వైట్ కలర్ టాప్.. బ్లాక్ బాటమ్తో మెడలో డైమండ్ పెండెంట్‌తో రకుల్ ఎలిగెంట్ లుక్‌లో అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.