హైద‌రాబాద్ లో దారుణం…చాక్లెట్ ఇస్తాన‌ని 13ఏళ్ల బాలుడిపై అత్యాచారం..!

-

రానూ రానూ మాన‌వ‌మృగాళ్లు దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాయి. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద‌వాళ్ల దాకా వ‌యసుతో సంబంధం లేకుండా వారిపై అత్యాచారాలు చేయ‌డం చూస్తూనే ఉన్నాం. ఇక లింగ భేదం లేకుండా అత్యాచారాల‌కు పాల్ప‌డ‌టం సైతం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా హైద‌రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. చాక్లెట్ ఇప్పిస్తాన‌ని 13 ఏళ్ల బాలుడిపై 23 ఏళ్ల యువ‌కుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న చిల‌క‌లగూడ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది.

13 years boy raped in hyderabad

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం…మ‌ధురాన‌గ‌ర్ కాల‌నీకి చెందిన సతీష్ 23 అనే యువ‌కుడు స్థానికంగా ఓ రంగురాల్లు అమ్మే దుకాణంలో ప‌నిచేస్తున్నాడు. కాగా ఈ నెల 24న స‌తీష్ అదే ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలుడికి చాక్లెట్ ఇప్పిస్తాన‌ని చెప్పి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. తీవ్ర‌భ‌యాందోళ‌న‌కు గురైన బాలుడు జరిగిన విష‌యాన్ని త‌ల్లిదండ్ర‌ల‌కు చెప్పాడు. దాంతో వారు ఈ ఘ‌ట‌న పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version