స్నేహం అంటే ఇదేనేమో… 1300 కిలోమీటర్లు ఆక్సిజన్ సిలండర్ తో…. ?

-

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇటువంటి సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం చాలా అవసరం. అయితే దీనికోసం రాంచి లో ఉండే దేవేంద్ర కుమార్ శర్మ కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు.

తన స్నేహితుడిని కాపాడేందుకు దేవేంద్ర 1300 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. 24 గంటల పాటు కార్లో ఆక్సిజన్ ని తీసుకుని వెళ్లారు. దేవేంద్ర తన స్నేహితుడు సంజయ్ నుంచి రాజన్ పరిస్థితి బాగోలేదని, ఆక్సిజన్ కావాలని కరోనా బారిన పడ్డారని తెలిసింది.

తన ట్రీట్మెంట్ కి ఒక్క సిలెండర్ వుంది అని.. అయితే అది ఒక్కరోజు మాత్రమే వస్తుందని సంజయ్ చెప్పాడు. రాజన్ ఫ్లాట్ లో వుండే ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. రాజన్ కి కూడ కరోనా పాజిటి వచ్చింది. దీనితో రాజన్ తన ఇంటికి వచ్చేసాడు. దీనితో ట్రీట్మెంట్ ని తన సొంత ఊరి లో అందిస్తున్నారు.

దేవేంద్ర మరియు రాజన్ కుటుంబ సభ్యులు బొకారో లో ఉంటారు. ఏప్రిల్ 24 దేవేంద్ర కి ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిన వెంటనే తన చిన్ననాటి స్నేహితుడు రాజన్ కోసం బయలుదేరాడు. ఆక్సిజన్ సిలిండర్ కోసం చాలా విధాలుగా ప్రయత్నం చేశాడు. బొకారో వచ్చిన తర్వాత రాకేష్ కుమార్ గుప్తా ఝార్ఖండ్ గ్యాస్ ప్లాంట్ యజమానిని దేవేంద్ర సంప్రదించాడు.

ఆ తర్వాత తనకి ఒక సిలిండర్ దొరికింది. ఇలా సంజీవినిని తన స్నేహితుడి కోసం తీసుకెళ్లాడు. కానీ వైశాలి వెళ్లడం నిజంగా పర్వతంలా అనిపించింది. ఏకంగా 13 వందల కిలో మీటర్లు ప్రయాణం చేయాలి. తాను సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. సోమవారం నాడు తన స్నేహితుడు దగ్గరికి వెళ్ళాడు.

ఆ సమయంలో రాజన్ చాలా కష్టంగా శ్వాస తీసుకుంటున్నాడు. ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని వెళ్లి తన స్నేహితుడిని సేవ్ చేశాడు. దేవేంద్ర మరియు రాజన్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి పోతే సంజయ్ సక్సేనా కేర్ తీసుకునే వాడు.

ఇద్దరు 34 ఏళ్లు వయసు వాళ్ళు. రాజన్ తన భార్య తో పాటు నోయిడాలో ఉంటున్నాడు. దేవేంద్ర కి ఇంకా పెళ్లి కాలేదు. తాను రాంచి లో ఉంటున్నాడు, ఇద్దరు కుటుంబీకులు కూడా ఇంకా బొకారో లోనే ఉంటున్నారు. తన స్నేహితుడు పూర్తిగా కోల్పోయే వరకు బోకరో రాను అని దేవేంద్ర అంటున్నాడు. ఎంత గొప్ప స్నేహం ఓ కదా వీరిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version