ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. శ్రీ సత్యసాయి జిల్లాలో నేషనల్ హైవే-342 కు చెందిన 2 లేన్ల పుట్టపర్తి – కోడూరు రహదారిని 4-లేన్లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రెండేళ్ళలో మొత్తం 1318.57 కోట్ల రూపాయలతో 47.65 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
ప్రధాన పట్టణాలైన పుట్టపర్తి, బుక్కపట్నం కు మెరుగైన రహదారి మార్గం కానుందని.. పుట్టపర్తి వద్ద అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రాలను ఈ రహదారి మార్గం అనుసంధానం చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తో పాటు, పలు ఇతర రాష్ట్రాల ప్రజలకు , విదేశాల నుంచి వచ్చే రోగులకు సేవలందించే ప్రపంచ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ రహదారి నిర్మాణం మరింత అనుసంధానం కానుందని వివరించారు కేంద్ర రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.