పాక్ లో 138, భారత్ లో 116 మంది జర్నలిస్ట్ లను చంపేశారు.. షాకింగ్ అంశాలు వెలుగులోకి !

-

సినిమాల ప్రభావమో లేక మన ఇండియన్ మీడియా ప్రభావమో తెలియదు కానీ పాకిస్తాన్ అంటేనే మన జనానికి అదోరకమైన ఫీలింగ్. దానిని కోపం అనాలో, అసహ్యం అనాలో లేక ఏహ్య భావన అనాలో తెలియదు కానీ ఎందుకో ఆ దేశం అంటే సగటు భారతీయుడికి పెద్దగా ఇష్టం ఉండదు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఎక్కువగా ఊతం ఇస్తుంది అన్న ఆరోపణలు పాకిస్తాన్ మీద ఎప్పటినుంచో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. అయితే ఆ దేశంలో ఇప్పటిదాకా 138 మంది జర్నలిస్టులు చంపేశారు అన్న తాజా సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది.

1990 నుంచి ఈ రోజు దాకా మొత్తం 138 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ సంస్థ చేసిన సర్వేలో తేలింది. శుక్రవారం నాడు ఈ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ గ్లోబల్ జర్నలిజం అనే అంశం మీద ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ శ్వేత పత్రం ప్రకారం ఇరాక్, మెక్సికో, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, ఇండియా దేశాలు జర్నలిజం చేయడానికి చాలా ప్రమాదకరమైన దేశాలు అని పేర్కొన్నారు. ఇక ఇప్పటి దాకా పాకిస్థాన్లో 138 మంది జర్నలిస్టు హత్యకు గురికాగా భారతదేశంలో కూడా 116 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది ఐదుగురు పాకిస్తానీ జర్నలిస్టు తమ ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్ లో కూడా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ వంటి వారి ఉదంతాలు ఎన్నో వెలుగులోకి వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version