తిరుపతి సీటు విషయంలో జనసేనకు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ !

-

బిజెపి జనసేన కు మరోసారి హ్యాండ్ ఇచ్చింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అంశంలో పోటీకి దింపి మరి వెనక్కి తగ్గిన జనసేనకు తిరుపతి సీటు విషయంలో మరో షాక్ తగిలినట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సీట్లు తమకే కేటాయించాలని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి మరి చాలా మంది సీనియర్ నేతలతో చర్చలు జరిపి వచ్చారు. కానీ ఈసారి ఈ ఉప ఎన్నికల పోటీలో కూడా బిజెపి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తిరుపతిలో కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన అనంతరం బిజెపి జాతీయ రాష్ట్ర నేతలు కలిసి శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్ర అనంతరం చేసిన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన బీజేపీ అభ్యర్థికి ఓటేయాలని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనసేనలో చర్చనీయాంశంగా మారాయి..దీన్ని బట్టి చూస్తే పోటీకి దిగి బిజెపి అభ్యర్థి అనే తేలిపోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version