విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ ఆరు హత్యల కేసులో నిందితుడు అప్పలరాజు కి కేజీహెచ్ వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. అనంతరం అప్పలరాజు ని మెజిస్ట్రేట్ ముందు పెందుర్తి పోలీసులు హాజరుపరచగా నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్. దీంతో అప్పలరాజును విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. తన కూతురి జీవితం పాడు చేసినందుకే విజయ్ కుటుంబాన్ని చంపానని అప్పలరాజు మెజిస్ట్రేట్ వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఇక విజయ్ కుటుంబసభ్యుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిన్న సాయంత్రమ పూర్తయ్యింది. కేజీహెచ్ నుంచి శివాజీ పాలెంకు ఆరు మృతదేహాలను తరలించారు. ఇసుక తోటలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు తన కుటుంబాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన అప్పలరాజు తో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుంటేనే పోస్ట్‌మార్టానికి అంగీకరిస్తానని విజయ్, అతని బంధువులు అద్దం తిరుగారు. అధికారుల హామీతో ఎట్టకేలకు పోస్ట్‌మార్టంకు ఒప్పుకున్నారు.