విజయవాడలో సీఎం వైఎస్ జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీశ్ కి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎంను హతమార్చే ఉద్దేశంతోనే అతను రాయితో వచ్చాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపిన సంగతి తెలిసిందే. కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా అతడిని గుర్తించామన్నారు. నిందితుడి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని, కీలక ఆధారాలు సేకరించామని వెల్లడించారు.
కాగా, విజయవాడలో సీఎం జగన్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు జగన్ పై రాయితో దాడి చేశారు.ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కన్నుకి గాయం అయింది.రాయి బలంగా తగలడంతో కన్ను వాచింది. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్న విషయం తెలిసిందే.