Big Breaking : చంద్రబాబుకు రిమాండ్‌.. 14 రోజులు రిమాండ్‌ విధించిన ఏసీపీ కోర్టు.

-

చంద్రబాబుకు బెయిల్ వస్తుందా?లేక రిమాండ్ కు తరలిస్తారా అనేదానిపై ఉత్కంఠ తెర పడింది. చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్‌ను విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. అయితే.. సిట్‌ కార్యాలయం నుంచి కోర్టుకు తీసుకొచ్చిన సీఐడీ అధికారులు.. ఇప్పటికే రిమాండ్‌ రిపోర్టును న్యాయస్థానానికి సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు తరఫున సిద్ధార్థ్‌ లూథ్రా టీమ్‌, సీఐడీ తరఫున ఏఏజీ పీ.సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వేళ.. ఈ మధ్యాహ్నం నుంచి తీర్పు కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబు… తీర్పు వెల్లడిస్తున్న నేపథ్యంలో కోర్టు హాల్లోకి వెళ్లారు.

కోర్టు హాల్లోకి 30 మందిని మాత్రమే అనుమతించారు. తీర్పు నేపథ్యంలో కోర్టులో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. తీర్పు నేపథ్యంలో ఏసీబీ కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ సీపీ కాంతిరాణా టాటా భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అయితే.. ఉత్కంఠకు తెరదించుతూ చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. నేరపూరిత కుట్రకు చంద్రబాబు పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. 409 సెక్షన్ వర్తిస్తుంది. 14 రోజుల రిమాండ్‌ విధిస్తున్నామని న్యాయమూర్తి అన్నారు. అయితే.. ఇప్పటికే విజయవాడలో భారీగా మోహరించిన పారా మిలిటరీ బలగాలు కోర్టు పరిసరాలను ఖాళీ చేస్తున్నారు. కోర్టు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. కోర్టు నుంచి 500 మీటర్ల మేర పోలీసులు, భద్రత సిబ్బంది మినహా ఇతరుకు అనుమతివ్వడం లేదు. ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version