భువనేశ్వర్, జాజ్ పూర్ లోని ఒకరి ఇంట్లో ఏకంగా 14 పాము పిల్లలు దర్శనమిచ్చాయి ఆ ఇంటి సభ్యులకు తెలియంకుండా మరీ పాము వారి ఇంటి కిచెన్ లో పిల్లలను పెట్టింది 14 పాము పిల్లలను ఒకేసారి చూసేసరికి వారి నోట మాట రాలేదు. వివరాల్లోకి వెళితే.. జాజ్ పూర్ జిల్లాలోని సారంగ్పూర్ పూర్ లో ఒకరి ఇంట్లో ఓ పెద్ద సర్పం తిరుగుతూ కనిపించింది. అది చూసిన ఆ ఇంటి సభ్యులు ఒక్కసారిగా పరుగులు తీశారు.
వెంటనే స్నేక్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు. స్నేక్ హెల్ప్ లైన్ సభ్యులు ఇంటికి చేరుకొని పరిశీలిస్తుండగా వారికి తమ ఇంటి కిచెన్ లో గ్యాస్ సిలిండర్ పక్కన ఓ చిన్న రంధ్రం కనపడింది. ఆ రంధ్రంలో ఏం ఉంది అని చూడగా అందులో ఏకంగా 14 నల్ల నాగు పాము పిల్లలు కనపడ్డాయి. ఆ స్నేక్ హెల్ప్ లైన సిబ్బంధి 14 నాగు పాము పిల్లలను ఇంటి వారికి చూపేసరికి వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. తమకు తెలియకుండానే ఇదంతా జరిగిందని వారు తెలుసుకున్నారు. వారికి తమ ఇంట్లోని సిలిండర్ పక్కన రంధ్రం గురించి తెలియదు పాము ఎప్పుడొచ్చి గుడ్లు పెట్టిందో కూడా తెలియదు అని వారు చెబుతున్నారు. అయితే పాము పిల్లలు కనపడ్డాయి కానీ పాము మాత్రం కనిపించకపోయేసరికి వారు అక్కడ నుండి వెళ్ళిపోయారు.