ప్రపంచ వ్యాప్తంగా 14 వేల మంకీపాక్స్‌ కేసులు నమోదు

-

ఓ వైపు కరోనాతో సతమతమవుతున్న ప్రజలపై వైరస్‌లు దండయాత్ర మొదలుపెట్టాయి. ఇప్పటికే కరోనాతో పాటు జికా వైరస్‌లు దేశంలో వ్యాప్తి చెందుతుండగా.. ఇప్పుడు దానికి మంకీపాక్స్ తోడైంది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ వెల్లడించారు. అటు ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 14 వేల మంకీపాక్స్‌ కేసులు నమోదు అయ్యాయి. 70 దేశాలకు పాకిన మంకీపాల్స్‌ కేసులు..ఇండియాను వణికిస్తున్నాయి. ఇక ఆఫ్రికాలో మంకీపాక్స్‌తో ఐదుగురు మృతి చెందారు. కాగా.. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 21880 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,38,47,065 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,49,482 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.98 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 60 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,25,930 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 21219 మంది కరోనా నుంచి కోలు కున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version