బర్త్ డే విషెస్ చెప్పటానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకి !

-

చిత్తూరు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. స్నేహితుడు పుట్టిన రోజు కదా అని అతని ఇంటికి వెళ్లి హ్యాపీ బర్త్డే చెప్పి వద్దామని వెళ్ళిన 14 ఏళ్ల బాలుడు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. నిన్న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లె సమీపంలోని వాగులో 14 ఏళ్ల బాలుడు గల్లంతయిన సంగతి తెలిసిందే. పెరుమాళ్లపల్లెకు చెందిన నర్సింహారెడ్డి కుమారుడు సుమంత్ (14) వెదురుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

నిన్న తన స్నేహితుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి సమంత్ తో సహా ఐదుగురు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో పెరుమాళ్లపల్లె సమీపంలో ఉన్న వాగులో పడి గల్లంతు అయ్యాడు. బాలుని ఆచూకీ కోసం నిన్నటి నుండి గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి క్రితం సుమంత్ మృతదేహం లభ్యం అయింది. గజ ఈతగాళ్లు కొద్ది సేపటి క్రితమే దానిని బయటకు తీశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version