ట్యూషన్ తెచ్చిన తంటా.. 15 మంది చిన్నారులకు కరోనా !

-

ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. లాక్ డౌన్ లోకి వెళ్లి ఆరు నెలలు దాటింది. నిన్నటి నుండే ప్రభుత్వం అన్ని కార్యక్రమాలకి పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చింది. అయితే ప్రజలు ఎక్కువ మంది గుమికూడె పనులు ఏవీ చేయవద్దని చెబుతోంది. పిల్లలకి కూడా ఆన్ లైన్ క్లాసెస్ మీదే ఎక్కువ శాతం ఉండేలా చూస్తోంది. అయితే ఒక పల్లెటూర్లో పిల్లలు ట్యూషన్ కి వెళ్లి కరోనా బారిన పడిన సంగతి వెలుగులోకి వచ్చింది.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరులో 15 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ముందు ట్యూషన్ మాష్టారు కు కరోనా పాజిటివ్ రాగా ఈ పిల్లలు అందరూ ట్యూషన్ కు వెళ్ళి కరోనా బారినపడ్డట్టు తెలుస్తోంది. ఈ విద్యార్థులంతా ఏడేళ్ళలోపు చిన్నారులే కావడం ఇంకా టెన్షన్ రేపుతోంది. ఆ గ్రామంలో ఇప్పటికే 39 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయట. అయితే అందరూ ఏడేళ్ళ చిన్నారులే కావడంతో వారందరినీ మంగళగిరి ఎన్ఆర్ఐ క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. ఈ చిన్నారుల తల్లిదండ్రుల్లో కూడా కొందరికి కరోనా సోకిందని తెలుస్తోంది. దీంతో అధికారులు హుటాహుటిన గ్రామంలో సహయక చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version