ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 15 మంది అరెస్ట్: ఈడీ

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కవితను రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం ఈడీ అదుపులో ఉంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు మరో 15 మందిని అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపింది. ఇప్పటివరకు ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైలతో సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు పేర్కొంది. కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

కాగా, శనివారం రోజున ఢిల్లీ నుండి వచ్చిన ఐటీ, ఈడీ అధికారుల బృందం హైదరాబాద్లోని ఆమె ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని విచారించారు. అనంతరం కోర్టు అనుమతితో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news