పెళ్లి తెచ్చిన కరోనా…ఏకంగా 16 మందికి !

-

కరోనా అందరి జీవితాలను చిన్నాభిన్నం చేసేసింది. కొందరి ఉపాధి కోల్పోతే, కొందరు కనీసం తినడానికి కూడా సంపాదించుకోలేని పరిస్థితి. ఇదంతా ఒకదారి అయితే అంతా సెట్ అయిపొయింది ఈ ఏడాది పెళ్లి చేసుకుందాం అని అనుకున్న వారి ప్లాన్స్ అన్నీ పాడు చేసింది. చాలా మంది పెళ్లి అంటే జీవితానికి ఒక్కసారే కాబట్టి ఈ కరోనా హడావుడి తరువాత చేసుకుందామని అనుకుంటుంటే ఇంకొందరు మాత్రం తక్కువ మందితో కానిచ్చేద్దామని చేసేసుకుంటున్నారు.

ఈ క్రమంలో అలా చేసుకున్న ఒక పెళ్లి ద్వారా ఏకంగా 16 మంది కరోనా బారిన పడ్డారు. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా ధర్మపురిలో కరోనా కలకలం రేగింది. ఒక వివాహా వేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. వారం క్రితం ధర్మపురికి చెందిన అమ్మాయికి, మంచిర్యాలకు చెందిన అబ్బాయితో ధర్మపురిలోనే కాస్త గ్రాండ్ గా పెళ్లి జరిగింది. అనుమతి తీసుకున్నా పరిమితికి మించి జనం వచ్చారు. ఈ దెబ్బకు వివాహ కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరూ దగ్గు, జలుబు, జ్వరంతో బాధ పడుతున్నట్టు తెలిసింది. ఇప్పటికి పరీక్షలు చేయించుకున్న వారికి 16 మందికి పాజిటివ్ గా నిర్ధారణ కాగా ఈరోజు ఇంకెంత మందికి తేలుతుందో వేచి చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version