మొన్నటిదాక ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఎట్టకేలకు దిగొచ్చాయి. వరుసగా నాలుగు రోజులు పాటు బంగారం ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 3350 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 54,680కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ.3010 తగ్గడంతో రూ.50,130కు చేరుకుంది.
అయితే వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.7,500 తగ్గిపోయింది. దీంతో ధర రూ.65,000 కి చేరింది. ఢిల్లీ మార్కెట్‌లోనూ కూడా పసిడి ధర దిగొచ్చింది.. నేడు మార్కెట్‌లో రూ.200 మేర ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,500 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర బుధవారం ధరతో పోలిస్తే 3200 రూపాయలు తగ్గి 50,250 రూపాయల వద్ద నిలిచింది. కేజీ వెండి ధర రూ.7,500 తగ్గుదలతో రూ.75,150 కు చేరింది.