తెలంగాణ‌లో నేడు కొత్త‌గా 164 క‌రోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వ‌స్తున్నాయి. థ‌ర్డ్ వేవ్ దాదాపు ముగిసిన‌ట్టే క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. కాగ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించిన క‌రోనా బులిటెన్ ప్రకారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 31,303 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. ఇందులో 963 క‌రోనా ప‌రీక్షల ఫ‌లితాలు రావాల్సి ఉండ‌గా.. మిగితా వాటిలో 164 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

దీంతో నేటి వ‌ర‌కు రాష్ట్రంలో 7,89,401 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. కాగ నేడు కూడా రాష్ట్రంలో ఎలాంటి క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. అలాగే రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 385 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 2,386 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా ప‌ని చేసింది. క‌రోనా టెస్టులు గానీ, వ్యాక్సినేషన్ ప్ర‌క్రియా వేగ‌వంతం తో రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ అదుపులోకి వ‌చ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version