ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా టిఎస్ఆర్టిసి తొలిసారి 16 AC స్లీపర్ బస్సులను ఇవాళ ప్రారంభించనుంది. ఈ బస్సుల్లో ప్రయాణికులకు ఉచిత వైఫై సౌకర్యాన్ని అందించనుంది. మంత్రి పువ్వాడ అజయ్ బస్సులను ప్రారంభిస్తారు. ఇటీవల 12 నాన్ AC స్లీపర్ బస్సులను టిఎస్ఆర్టిసి ప్రారంభించింది. ఈ 16 ఏసీ సర్వీసులను విశాఖ, తిరుపతి, చెన్నై, బెంగళూరు, హుబ్బిలి మార్గాల్లో నడపనున్నట్లు సంస్థ తెలిపింది.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ, గుంటూరు వంటి నగరాలకు ‘వెన్నెల’ పేరుతో ఏసీ స్లీపర్ బస్సులు నడిచాయి. రాష్ట్ర ఆవిర్భావం.. ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి విడిపోయి టీఎస్‌ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి ఏసీ స్లీపర్ బస్సులు లేవు. ఈ అవకాశాన్ని టీఎస్‌ఆర్టీసీ ఆలస్యంగా అందిపుచ్చుకుంది. ‘లహరి’ పేరుతో కొంతకాలం క్రితం నాన్ ఏసీలో 12 స్లీపర్, హైబ్రిడ్ (కొన్ని బెర్తులు, కొన్ని సీట్లు) ప్రవేశపెట్టింది. ఏసీ స్లీపర్ బస్సులను మాత్రం అశోక్ లైలాండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఒక్కో బస్సుకు రూ.55 లక్షలు వెచ్చిస్తోంది.
ప్రయాణికులకు శుభవార్త! 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు రేపటి నుండి అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా వీటిని #TSRTC వాడకంలోకి తెస్తోంది. LB Nagar లో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ
బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభిస్తారు. #NewACSleeperBuses pic.twitter.com/WBrFy37xmt— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) March 26, 2023