తెలంగాణ రాష్ట్రం లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 172 కరోనా కేసుల నమోదు అయ్యాయి. అదే విధంగా కరోనా వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారు. అలాగే 167 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు 6,73,312 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 6,65,599 మంది మహమ్మరీ నుంచి కోలుకున్నారు.
అదే విధంగా ప్రస్తుతం 3,741 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,972కి పెరిగింది. కాగ గడిచిన 24 గంటలలో రాష్ట్రంలో 39,804 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గతంలో కంటే ప్రస్తుతం కరోనా వ్యాప్తి చాలా వరకు తగ్గింది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య కూడా గణీనియంగా తగ్గుతున్నాయి. అయినా కరోనా మహమ్మారీ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా పోలేదని హెచ్చరిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ని నిర్ములించడానికి వ్యాక్సిన్ వచ్చినా కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే అని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తుంది. ఇప్పడు కూడా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.