తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో అండమాన్ దీవుల పరిసర ప్రాంతాల్లో ఈ నెల 13న అంటే ఇవాల్టి రోజున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అది క్రమంగా బలపడి ఈనెల 15వ తేదీన వాయుగుండంగా మారవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
అంతకు ముందు ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ ఈ ప్రభావంతో శని, ఆది అలాగే సోమవారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని… మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కాగా నెల్లూరు, తిరుపతి జిల్లాలో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా తిరుపతి గాట్ రోడ్ కూడా మూసివేశారు అధికారులు.