ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదుగాని..ఇప్పటినుంచే ప్రతి పార్టీ ఎన్నికలే టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నాయి. అసలు దగ్గరలోనే ఎన్నికలు ఉన్నట్లు రాజకీయం చేస్తున్నాయి. తమ పార్టీ గెలిచేస్తుందంటే…తమ పార్టీ గెలిచేస్తుందని పార్టీల నేతలు సవాళ్ళు చేస్తున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చామని..ఈ సారి 175కి 175 సీట్లు గెలుచుకుంటామన్నట్లుగా వైసీపీ మాట్లాడుతుంది. అసలు టీడీపీ కథ ముగిసిపోయిందని అంటున్నారు. ఆఖరికి సీఎం జగన్ సైతం 175 సీట్లు ఎందుకు గెలవలేమని మాట్లాడుతున్నారు. అంటే వైసీపీ కాన్ఫిడెన్స్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఇదంతా వైసీపీ వర్షన్…మరి టీడీపీ వర్షన్ ఎలా ఉందంటే…ఈ సారి అధికారం తమదే అని..ప్రజలు వైసీపీని చిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నారని, ఈ సారి 151 కాదు..15 సీట్లు వచ్చిన గొప్పే అని మాట్లాడుతున్నారు. అలాగే టీడీపీ ఒంటరిగా పోటీ చేసి 160 సీట్లు గెలుచుకుని సత్తా చాటుతుందని అంటున్నారు. ఇది టీడీపీ వర్షన్. ఇక జనసేన వర్షన్ మరోలా ఉంది..ఈ సారి వైసీపీ-టీడీపీలని కాకుండా ప్రజలు తమ వైపు నిలబడేందుకు రెడీగా ఉన్నారని, పవన్ కల్యాణ్ కాబోయే సీఎం అంటూ జనసేన నేతలు మాట్లాడుతున్నారు.