హైదరాబాద్ అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే బై క్ పై ఏకంగా… 179 చలాన్లు పడ్డాయి. దీంతో ట్రాఫిక్ 42 వేల రూపాయల ఫైన్ విధించింది. ఈ బైక్ ను పోలీసులు పట్టుకోవడంతో… బైక్ వదిలి పరార్ అయ్యాడు వాహన దారుడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తా లో నిన్న వాహన తనిఖీలు చేశారు కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు.
ఈ నేపథ్యంలోనే… పోలీసులను చూసి బైక్ వదిలి పారిపోయిన ఓ వాహనదారుడు. వదిలి వెళ్ళిన AP 23 M 9895 హీరో హోండా ప్యాషన్ గా పోలీసులు గుర్తించారు. బైక్ చాలాన్ చెక్ చేసిన ట్రాఫిక్ పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఆ బైక్ పై 179 చలాన్లు, 42,475 రూపాయల ఫైన్ ఉండటం చూసి అవాక్కయ్యారు పోలీసులు. భారీ చలాన్ ఉండడంతో బైక్ సీజ్ చేశారు కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు. ఇక బైక్ వదిలి వెళ్లి.. పారిపోయిన ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.