బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కాంగ్రెస్, బిజెపి పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఏకమయ్యాయని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు.భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…’బీజేపీ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదు. దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి అని అసహనం వ్యక్తం చేశారు.
ఆ పార్టీ దేవుడి పేరుతో ఓట్లు అడుగుతోంది. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చేయడం లేదు అని మండిపడ్డారు. రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. బీజేపీ ప్రభుత్వం వల్లే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది’ అని ఆయన కేసిఆర్ ఫైర్ అయ్యారు.ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇయ్యలే..ఐదు నెలలుగా ప్రభుత్వ కాలేజీల్లో జీతాలు ఇయ్యలే..గురుకులాల్లో పిల్లలకు కలుషిత ఆహారం పెడుతున్నారు అని ఫైర్ అయ్యారు కేసిఆర్.