ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం బంపర్ ఆఫర్..! లొంగిపోయిన 18 మంది మావోయిస్టులు…!

-

18 maoists in chhattisgarh surrendered to police
18 maoists in chhattisgarh surrendered to police

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఓ అద్భుతమైన కార్యానికి ఒడగట్టింది. మావోలను తీవ్రవాదం వదలమని వారికి ఉపాధి కలిపించే బాధ్యత తమదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో దాదాపుగా 18 మావో లు తీవ్రవాదానికి గుడ్ బై చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వివరాల్లూకి వెళితే.. ‘మావోయిస్టులూ.. తిరిగి ఇంటికి రండి’ అంటూ ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో భాగంగా తీవ్రవాదానికి గుడ్ బై చెప్పి తిరిగి జన జీవన స్రవంతి లోకి వారిని వచ్చేయమని ప్రభుత్వం కోరింది. వారు తిరిగి వస్తే వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల రివార్డును ఆపై వారికి ప్రత్వమ్ తరఫున ఉపాధి హామే కూడా ఇస్తామని వారిని కోరింది. ఈ ప్రకటనకు స్పందిస్తూ మావోయిస్టు అనుబంధ సంస్థలైన చేతన నాట్యమండలి, దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్‌కు చెందిన 18 మంది మావోయిస్టులు చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎదుట లొంగిపోయారు. కాగా వారికి అందవలసిన లక్ష రూపాయల రివార్డును వారి కుటుంబాలకు అప్పజెప్పింది. కాగా వారికి టైలరింగ్ నిర్మాణ పనుల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని సీఆర్‌పీఎఫ్ డీఐజీ అభిషేక్ పల్లవ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news