మ‌రో సంచ‌ల‌నానికి జ‌గ‌న్ రెడీ.. ఆ సెంటిమెంట్ టెన్ష‌న్ పెడుతోంది..!

-

ఏడాది పూర్త‌యింది. మంచి సీఎం అనిపించుకుంటాన‌ని జ‌గ‌న్ ఏడాది కింద‌టే తాను సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మయం లో ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. దీనికి ఆయ‌న విధించుకున్న టైం.. ఆరు మాసాలే. కానీ, ఇప్పుడు ఏడాది దాటి మూడు మా సా లైంది. మ‌రి.. ఇప్పుడు ఆయ‌న మంచి సీఎం అనిపించుకున్నారా? ఆయ‌న నిర్ణ‌యాల‌కు ప్ర‌జ‌లు జై కొడుతున్నారా?  సీఎంగా జ‌గ‌న్ అద్భుతాలు చేస్తున్నార‌ని అంటున్నారా?  జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మాకు కంటినిండా నిద్ర ప‌డుతోంద‌ని ఫీల‌వుతున్నారా?  మ‌రి ఈ విష‌యాలు తెలిసేదెలా?  ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌తి ప‌థ‌కం ప్ర‌జ‌లు చేరుతోందో లేదో తెలుసుకునేదెలా?  ఎంత టెక్నాల‌జీ ఉన్నా.. ఎన్నిసర్వేలు ఉన్నా.. నేరుగా ప్ర‌జ‌ల నోటి నుంచి `నువ్వే ఉత్త‌మ సీఎం` అని అనిపించుకుంటేనే క‌దా.. జ‌గ‌న్ ఆశ‌యం ఫ‌లించేది!

ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యానికి తెర‌దీస్తున్నారు. నేరుగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లేందుకు ఆయ‌న రెడీ అయ్యారు. దీనికి ఆయ‌న గ్రామ స‌భ లేదా ర‌చ్చ‌బండ అని పేరు పెట్టాల‌ని యోచిస్తున్నారు. అయితే, ఇక్క‌డే ఆయ‌న‌ను సెంటిమెంటు వేధిస్తోంద‌ని అంటున్నారు వైసీపీలో సీనియ‌ర్లు. గ‌తంలో 2009లో రెండో ప‌ర్యాయం విజ‌యం సాధించిన జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. కూడా ఇదే కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. రెండో ద‌ఫా ఆయ‌న గెలిచిన త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల నాడి తెలుసుకునేందుకు అత్యంత త‌క్కువ స‌మ‌యంలోనే ప్ర‌జ‌ల‌తో నేరుగా భేటీ కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 2009, సెప్టెంబ‌రు 2 ఆయ‌న ర‌చ్చ‌బండ నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యించి.. అదే రోజు.. హెలీకాప్ట‌ర్‌లో వెళ్లారు.

అయితే, అనూహ్య రీతిలో అది ప్ర‌మాదానికి గురై.. వైఎస్ దిగంతాల‌కు వెళ్లిపోయారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను చేరుకునేం దుకు జ‌గ‌న్ కూడా సిద్ధ‌మ‌య్యారు. ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో ప్ర‌జానాడిని నేరుగా తెలుసుకునేందుకు ఆయ‌న రెడీ అయ్యా రు. త‌న తండ్రి స్ఫూర్తితో ర‌చ్చ‌బండ అనేపేరుతో ఆయ‌న ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాల‌ని అనుకున్నారు. కానీ, జ‌గ‌న్ మాతృ మూర్తి విజ‌య‌ల‌క్ష్మి మాత్రం దీనికి మ‌రో పేరు పెట్టుకోవాల‌ని సూచించార‌ని తెలిసింది. దీంతో గ్రామ స‌భ అని పేరు ను ఖ‌రారు చేయ‌నున్న‌ట్టు తెలిసింది.

అదే స‌మ‌యంలో వైఎస్ హెలీకాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందిన నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మానికి హెలీకాప్ట‌ర్‌ను వినియోగించ‌కూడ‌ద‌ని పార్టీ సీనియ‌ర్లు  కోరుతున్న‌ట్టు స‌మాచారం. ఆ కార్య‌క్ర‌మానికి-హెలికాప్ట‌ర్‌కు సెంటిమెంటు ఉంద‌ని అంటున్నారు. దీంతో జ‌గ‌న్ కూడా ఈ సెంటిమెంటుకే మొగ్గు చూపుతున్నార‌ని అంటున్నారు. సెప్టెంబ‌రులోనే కార్య‌క్ర‌మా న్ని ప్రారంభించినా.. హైలికాప్ట‌ర్ వినియోగించ‌కుండా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలిసింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news