1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటణ.. 40 ఏళ్లు నిల్వ ఉంచిన వ్యర్థాల తొలగింపు

-

1984 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదం అప్పట్లో దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసిన విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన పారిశ్రామిక విపత్తుగా అభివర్ణించారు. భోపాల్‌లో గల యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసీఐఎల్) పురుగుమందుల ప్లాంట్లో డిసెంబరు 3వ తేదీ రాత్రి పూట జరిగింది. సుమారు 5 లక్షల మందికి పైగా ప్రజలు మిథైల్ ఐసోసనియేట్ (MIC)వాయువు, ఇతర రసాయనాల ప్రభావానికి గురయ్యారు.

ఈ ప్రమాదంలో సుమారు 20వేలకు పైగా అమాయకపు ప్రజలు మృతి చెందినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో 40 ఏళ్లుగా నిల్వ ఉంచిన 337 టన్నుల విష వ్యర్థాలను తాజాగా అధికారులు తొలగించారు. వాటిని భారీ భద్రత నడుప ఇండోర్ పితాంపూర్‌కు తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news