కాకినాడ టోల్‌ గేట్‌ దగ్గర దారుణం… కానిస్టేబుళ్లపైకి కారు ఎక్కించిన గంజాయి బ్యాచ్ !

-

కాకినాడ జిల్లాలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది.. ఏకంగా పోలీసులపైకే కారు ఎక్కించింది గంజాయి బ్యాచ్. ఈ సంఘటన నిన్న రాత్రి జరుగగా.. ఇవాళ వీడియో బయటకు వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Police checking vehicles at Krishnavaram toll plaza in Kakinada district

నిన్న రాత్రి కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేశారు పోలీసులు. ఇక అదే సమయంలో కారులో గంజాయి తరలిస్తున్నారు స్మగ్లర్లు. దీంతో ఆ కారు ఆపేందుకు ప్రయత్నించగా.. కానిస్టేబుళ్లపైకి ఎక్కించింది గంజాయి బ్యాచ్. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లను ఆస్పత్రి కి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గంజాయి బ్యాచ్ పరారీలో ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news