ఉల్లి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. పంట పండించిన ప్రతి రైతుకు హెక్టార్ కు రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఎవరూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు అచ్చెన్నాయుడు.

కాగా, రెండు తెలుగు రాష్ట్రాలలో ఉల్లిపాయల ధరలు.. భారీగా తగ్గిపోయాయి. దీంతో ఉల్లి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మొన్నటి వరకు భారీగా ధర ఉన్న ఉల్లి ధర ఒకసారిగా పడిపోవడంతో… ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉల్లి రైతులు. తెలంగాణ రాష్ట్రంలో కిలో ఉల్లిగడ్డ ధర ఐదు రూపాయలు నుంచి 16 రూపాయలకు మాత్రమే లభిస్తోంది.
అయితే వినియోగదారులకు వచ్చేసరికి 25 రూపాయల నుంచి 45 రూపాయలు… పలుకుతోంది ఉల్లిగడ్డ. ఫలితంగా మధ్యవర్తులే ఈ ఉల్లిగడ్డ ద్వారా… లాభపడుతున్నారు. రైతులు అలాగే సామాన్య ప్రజలు మాత్రం నష్టపోతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వింటాల్ కనిష్టంగా 500 ఒక రూపాయలు ఉండగా గరిష్టంగా 1249 రూపాయలు ఉంది.