ఏపీ శాసనమండలిలో గందరగోళ వాతావరణం నెలకొంది. డీఎస్సీ, సోషల్ మీడియా పోస్టులపై నెలకొన్న అరెస్టులపై వైసీపీ వాయిదా తీర్మానం కోరింది. ఆ తీర్మానాలను చైర్మన్ తిరస్కరించారు.దీంతో వైసీపీ మండలి సభ్యులు ఆందోళనకు దిగారు.చైర్మన్ పోడియంను చుట్టుముట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో వైసీపీ వారియర్ల అరెస్టులపై చర్చ చేపట్టాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీలకు స్పీకర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయాణ డిమాండ్ చేయడంతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు జవాబిచ్చారు. అయితే, వేరే ఫార్మాట్‌లో రావాలని యనమల సూచించారు.దీనికి వైసీపీ ఎమ్మెల్సీలు ఒప్పుకోలేదు. మరల ఆందోళన చేపట్టారు.