ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ : కేజ్రివాల్

-

లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే ’10 హామీలను’ అమలు చేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.తమ పది హామీల్లో మొదటి గ్యారెంటీ దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్ సరఫరాయేనని కేజ్రీవాల్ వెల్లడించారు. అంతే కాకుండా మెరుగైన ఆరోగ్య సంరక్షణ వంటి హామీల ద్వారా పూర్తి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అయినా ప్రకటించారు.బీజేపీ తన వాగ్దానాలలో ప్రతిసారి విఫలమైంది అని కానీ తన హామీలకు ట్రాక్ రికార్డు ఉంది అని తెలిపారు. కాబట్టి కేజ్రీవాల్ గ్యారెంటీనా, మోడీ గ్యారెంటీనా అనేది ప్రజలే నిర్ణయిస్తారని కేజ్రీవాల్ తెలిపారు.

దేశంలో 3 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది, కానీ మన వాడుతున్నది 2 లక్షల మెగావాట్లే అని తెలిపారు. మన దేశం మరింత విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. తాము ఢిల్లీ, పంజాబ్‌లలో చేసినపుడు దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేయవచ్చు. దేశవ్యాప్తంగా పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని, దానికోసం రూ. 1.25 లక్షల కోట్ల వ్యయమవుతుంది అని పేర్కొన్నారు. ఆ నిధులను తాము ఏర్పాటు చేయగలమని కేజ్రీవాల్ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news