సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే…కఠిన చర్యలు – తెలంగాణ డీజీపీ రవి గుప్త

-

సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే…కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణ డీజీపీ రవి గుప్త. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసాం…ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కు ను వినిగించుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..
సోషల్ మీడియా కోసం ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేశామన్నారు తెలంగాణ డీజీపీ రవి గుప్త.

Telangana DGP Ravi Gupta

ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..లోక్‌సభ 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. 500 తెలంగాణ స్పెషల్‌ ఫోర్స్‌ విభాగాలు సహా.. 164 సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేసాం…7 వేల మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో బందోబస్తు చేసామని పేర్కొన్నారు. 89 ఇంటర్‌ స్టేట్‌ బోర్డర్‌ చెక్‌పోస్టులు, 173 అంతర్‌జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసాం..రూ.186కోట్ల విలువచేసే మద్యం, డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు.తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు నమోదు చేసాం.మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కేంద్ర బలాలతో భద్రత ఏర్పాటు చేసామని వివరించారు తెలంగాణ డీజీపీ రవి గుప్త..

Read more RELATED
Recommended to you

Latest news