జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ఓటు వేస్తే మళ్లీ రూ.200 పెన్షన్, 3 గంటల కరెంటు వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో పెన్షన్ కూడా సరిగా లేదు. చారానకోడికి బారాన మసాలా అన్నట్లుగా ఇచ్చినోళ్లు ఇంద్రుడు చంద్రుడు అని డబ్బా కొట్టుకుంటూ పెద్ద పెద్ద బిల్డప్‌లు అంటూ హేళన చేసారు మంత్రి. జడ్చర్ల నియోజకవర్గంలోనే మొత్తం 32,477 మందికి నెలకు రూ.2వేలు, రూ.3వేల చొప్పున ఆసరా పెన్షన్లు ఇచ్చి.. పెద్ద మనుషుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం కాదా? అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం లో సంవత్సరానికి కేవలం రూ.800కోట్లు పెన్షన్లకు ఖర్చు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వంలో 46లక్షల మందికి సంవత్సరానికి రూ.12వేలకోట్లు ఖర్చు చేస్తున్నాం అని ఆయన తెలిపారు.
‘రైతులను నేను అడుగున్నా ఎవరైనా కాంగ్రెసోళ్లు అరపైసా ఇచ్చారా? అని అడిగారు ఆయన. పంట పెట్టుబడి కింద అరపైస పంట సాయం చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న నాయకుడు, దిల్ ఉన్న నాయకుడు కాబట్టే.. ఏ రైతు కుటుంబం రోడ్డున పడకూడదని రూ.5లక్షల రైతు బీమా అమలు చేస్తున్నరు అని వెల్లడించారు. రైతు రూపాయి కట్టనవసరం లేకుండా ప్రభుత్వమే రూ.1450కోట్లు చెల్లించి రైతులకు రైతుబీమా అమలు చేయిస్తున్న నేత కేసీఆర్. జడ్చర్లలో రైతుబీమా కింద 1430 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబం ఖాతాలో రూ.5లక్షలు జమ చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దేశంలో నాలుగైదు చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఎక్కడైనా రైతుబీమా, రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ సంస్కారం ఉన్నదా? మీరు వచ్చి మాపై మాట్లాడుతారా? అంటూ ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.