కష్టాల కడలి 2020.. ఎన్ని..? ఇంకెన్ని..?

-

హ్యాపీ న్యూ ఇయర్ ఎవడు చెప్పాడో గాని నరికేయ్యాలి వాడిని.. కరోనా దెబ్బకు ఒక సోషల్ మీడియా యూజర్ చేసిన పోస్ట్ ఇది. పైకి చెప్పట్లేదు గాని బూతులు రాని వాళ్లకు కూడా లోపల ఈ ఏడాది మీద అదే ఫీలింగ్ ఉంది. 2020 ఫ్యాన్సీ నెంబర్ అనుకునే లోపే ఒక్కో దరిద్రం ఈ ఏడాదిని వెంటాడుతుంది. ముందు కరోనాతోనే ఈ ఏడాది మొదలయింది. న్యూ ఇయర్ వేడుకలు కూడా జరగలేదు.

ఇక జనవరి ఒకటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. పంట తడిచిపోయి లక్షల ఎకరాలు నాశనం అయిపోయాయి. ప్రభుత్వం సహాయం చేసినా సరే కోలుకునే పరిస్థితి లేదు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరణ అత్యంత వేగంగా పెరిగింది. చైనాకే అనుకున్న కరోనా ఇటలీ, ఫ్రాన్స్, జర్మని, స్పెయిన్, బెల్జియం సహా పలు యూరప్ దేశాలకు చుక్కలు అంటే ఏంటో చూపించింది.

ఆ పరిస్థితి అదుపులోకి రాకముందే అగ్ర రాజ్యం అమెరికాను ముంచి ఎత్తింది కరోనా. వేల కొద్దీ కేసులు నమోదు అయ్యాయి ప్రతీ రోజు. 13 లక్షలకు చేరుకుంది. మన దేశంలో కూడా ఇప్పుడు కరోనా 50 వేలు దాటింది. రోజు రోజుకి పెరుగుతుంది గాని ఎక్కడా తగ్గడం లేదు. దీనితో లాక్ డౌన్ ని విధించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధికంగా సామాజికంగా అభివృద్ధి చెందిన దేశాలు అన్నీ కూడా లాక్ డౌన్ లోనే ఉన్నాయి.

ఐటి, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు అన్నీ మూత పడ్డాయి. కోట్ల మంది ఉద్యోగాలు గాల్లో కలిసిపోయాయి. ప్రతీ రోజు కూడా పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇప్పుడు విశాఖలో ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ దెబ్బకు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విష వాయువులు లీక్ అయి వందల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకెన్ని దరిద్రాలు ఈ ఏడాది జరుగుతాయో అని ప్రజలు అందరూ కూడా భయపడిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version