దేశంలో త్వరలోనే డిజిటల్ కరెన్సీని తీసుకురానున్నారు. 2022-23 బడ్జెట్ ప్రసంగంలో నిర్మల సీతారామన్ వెల్లడించారు. దేశంలోొ త్వరలో డిజిటల్ రూపీని తీసుకువస్తామని ఆమె వెల్లడించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇతర టెక్నాలజీల సాయంతో దీనిని ఆర్బీఐ 2022-23 లో అందుబాటులోకి తీసుకు వస్తుందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది అండగా ఉంటుందని.. ఆమె అంచనా వేశారు.
క్రిప్టో కరెన్సీ వంటి డిజిటల్ ఆస్తుల్లో పెట్టుబడులు పెరగడంతో దీన్ని కూడా పన్నుల పరిధిలోకి తీసుకువస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. డిజిటల్ ఆస్తి నుంచి పొందే ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. ఇక ఆదా పన్ను రిటర్నుల్లో పొరపాట్లు సవరించుకునేందుకు దరకాస్తు చేసిన ఏడాది నుంచి 2 సంవత్సరాల్లో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.