2022 North Star’s: 2022 లో సౌత్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ తారలు వీరే..!

-

ఒకప్పుడు తెలుగు సినిమాలంటే బాలీవుడ్ ప్రేక్షకులు కానీ హీరోలు కానీ చాలా తక్కువ చేసి చూసేవారు. అక్కడ స్టార్స్ మనం సినిమాలో నటించడానికి కానీ.. వారి సినిమాలను ఇక్కడ ప్రమోట్ చేయడానికి కానీ ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. ఇంతకుముందులా మన సినిమాలను చిన్న సినిమాలుగా చూడడం లేదు. ఒక్క తెలుగు సినిమాలే కాదు మొత్తం సౌత్ ఇండస్ట్రీ మార్కెట్ బాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఎదిగింది. అయితే ఇక్కడి మార్కెట్ పై అక్కడి స్టార్స్ ఫోకస్ పెట్టి ఇక్కడ నటించడానికి కూడా వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే సౌత్ సినిమాల్లో ఆఫర్స్ అందుకొని 2022 ఏడాదిలో సౌత్ కి పరిచయమైన బాలీవుడ్ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

సల్మాన్ ఖాన్:


మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాతో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించింది.

అనన్య పాండే:
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన చిత్రం లైగర్.. ఇందులో అనన్య పాండే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ద్వారా ఈమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

అజయ్ దేవగన్ – అలియా భట్:


రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో అజయ్ దేవగన్ తో పాటు అలియా భట్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ కూడా తమ ప్రేక్షకులను అలరించారు.

అనుపమ్ ఖేర్:
కార్తికేయ 2 సినిమాతో ఈయన కూడా ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా తన నటనతో అదరగొట్టిన ఈయన ఇప్పుడు మళ్లీ నయనతార నటించిన కనెక్ట్ సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే.

సంజయ్ దత్ , రవీనా టాండన్:
కే జి ఎఫ్ టు ద్వారా సంజయ్ దత్ సౌత్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో విలన్ గా అదరగొట్టేశాడు. ఇక ఈయనతో పాటు రవీనాటాండన్ కూడా ఇదే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి.. తన నటనతో మెప్పించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version