21 kg of ganja seized in Miyapur: మియాపూర్ లో గంజాయి కలకలం రేపింది. మియాపూర్ లో 21 కిలోల గంజాయి కలకలం రేపింది. మియాపూర్ మెట్రో స్టేషన్ కల్వరి టెంపుల్ రోడ్డు లో గంజాయి పట్టుకున్నారు పోలీసులు. మహీంద్రా కారులో 21 కిలోల గంజాయిని.. ఒరిసా నుండి హైదరాబాద్ కి నలుగురు వ్యక్తులను తరలిస్తున్నారు.
అటు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు…కోర్టు ముందు హాజరు పరిచే ఛాన్స్ ఉంది. మియాపూర్ లో 21 కిలోల గంజాయి కలకలం రేపడం పై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వనస్థలిపురంలో ఓ బీటెక్ విద్యార్థి డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డాడు.సుష్మ థియేటర్ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన జాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.అతడి నుంచి 7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు గ్రాము రూ.2,500 చొప్పున కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.