పార్టీ పవర్ లోకి రావడానికి తెలుగు తమ్ముళ్లు కష్టపడి పనిచేశారు.. జనసేన, బిజేపీతో పొత్తు పెట్టుకున్నా.. అక్కడక్కడా ముఖ్యనేతలకు టిక్కెట్లు ఇవ్వకపోయినా.. టీడీపీ నేతలు ఎన్నికల సంగ్రామంలో వీరోచితంగా పోరాటం చేశారు.. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి.. చారిత్రాత్మక విజయాన్ని అందించారు.. నామినెటెడ్ పదవులు కోసం ఎదురుచూస్తున్న ముఖ్యనేతలకు మొదటి లిస్ట్ కొంత నిరాశ కల్గించింది.. దీంతో రెండో లిస్టు పై గంపెడాశలతో ఉన్నారు..
పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోపే నామినెటెడ్ పదవులు భర్తీ చేసి.. టిక్కెట్లు త్యాగం చేసిన వారితో పాటు.. ముఖ్యనేతలకు ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రకటించారు.. గతంలో అయితే నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో బాబు చాలా లేట్ చేసేవారు.. కొందరికి అవకాశం ఇచ్చేవారు..మరికొందరికి మొండిచెయ్యి చూపేవారు.. కానీ ఈసారి మాత్రం క్యాడర్ ను సంతృప్తిపరచాలని భావించిన ఆయన..తొలి విడతలో 20 దాకా నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు..అందులో టీడీపీకి 16 జనసేనకు 3 బీజేపీకి ఒకటి పదవి దక్కింది.
రెండో విడతలో 40 దాకా కార్పోరేషన్ల పదవులు భర్తీ చేయడానికి చంద్రబాబు సిద్దమయ్యారని పార్టీలో విపరీతమైన చర్చ నడుస్తోంది.. ఈ జాబితాలో బిజేపీ, జనసేననేతలతో పాటు.. టీడీపీ సినీయర్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. దీపావళికి ముందే పదవుల పందేరం ప్రకటన ఉంటుందని అందరూ భావిస్తున్నారు.. కానీ అది సాద్యపడేలా లేదని తెలుస్తోంది..
రెండో జాబితాలో పార్టీ కోసం టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈ పదవులు దక్కేలా చంద్రబాబు చూస్తున్నారట.. నెల్లూరుతోపాటు.. గోదావరి ఉత్తరాంధ్రా జిల్లాల నేతలకు అగ్రతాంబూలం ఉంటుందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు.. ఉత్తరాంద్ర, నెల్లూరు జిల్లా నేతలు పార్టీ కోసం కష్టపడి పనిచేశారు.. వారికి టిక్కెట్లు దక్కకపోయినా.. అభ్యర్దుల గెలుపు కోసం శ్రమించారు.. దీంతో వారికి మొదట ప్రయార్టీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.. అయితే రెండో జాబితా ఎప్పుడు విడుదల చేస్తారో అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది..