ఏపీ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. ఇక నుంచి 25 శాతం టికెట్లపై డిస్కౌంట్

-

త్వరలో ఆర్టీసీలో కారుణ్య నియామకాలు ఉంటాయని.. 1800 పై చిలుకు ఉద్యోగుల కుటుంబాల వారికి కారుణ్య నియామాకాలు చేస్తున్నామని వెల్లడించారు మంత్రి పేర్ని నాని. సంబంధిత జిల్లాలోనే ఉద్యోగం ఇస్తామని.. కలెక్టర్లకు ఆదేశాలిచ్చి లిస్టులు పంపామన్నారు. అరవై ఏళ్ళు పైబడిన ప్రయాణికులకు 25 శాతం రాయితీని ఏప్రిల్ ఒకటి నుంచి పునరుద్ధరిస్తున్నామని ప్రకటన చేశారు.

కేంద్ర ప్ర భుత్వ నిర్ణయాల వల్ల ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని.. కేంద్రం ఇచ్చే ఆయిల్ ధర కంటే బయట బంకుల్లో నాలుగు రూపాయలు తక్కువకే వస్తుందని వెల్లడించారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆయిల్ కంపెనీల్లో కాకుండా మార్కెట్‌లోని బంకుల్లో డీజిల్ కొనుగోలు చేస్తున్నామన్నారు. దీని వల్ల రోజుకు కోటిన్నర రూపాయల భారం ఆర్టీసీపై తగ్గుతుందని..మంత్రి పేర్ని నాని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు మంత్రి పేర్ని నాని. త్వరలోనే 40 బస్సులు ప్రభుత్వానికి అందనున్నాయని.. తిరుమల-తిరుపతికి యాభై బస్సులు నడుపుతామని స్పష్టం చేశారు మంత్రి పేర్ని నాని.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version