బెట్టింగ్ యాప్స్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే సిట్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించగా.. ఐదుగురు అధికారులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు సోమవారం ఉదయం డీజీపీ జితేందర్ దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
అందులో సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్, సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్ , శంకర్ లకు అవకాశం కల్పించారు. బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారంపై రానున్న 90 రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయాలని డీజీపీ జితేందర్ సిట్ బృందాన్ని ఆదేశించారు.కేసుల దర్యాప్తునకు అవసరమైన ఇతర అధికారులను సిట్ ఎంపిక చేసుకోనుంది. ఆర్థిక నిపుణులు, న్యాయ నిపుణులు, ఆడిటర్లు, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను సీఐడీ అదనపు డీజీ అనుమతితో సిట్ నియమించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.