తిరుపతి అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. వీఐపీ లైన్‌లో టూవీలర్‌ను ఆపకుండా ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వేగంగా దూసుకెళ్లాడు. అతన్ని ఆపేందుకు విజిలెన్స్ గార్డు ప్రయత్నించగా.. ఢీకొని మరీ లోనికి ప్రవేశించినట్లు సమాచారం.
దీంతో GNC టోల్ గేట్ వద్ద సదరు వ్యక్తిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి అన్యమతస్తుడిగా గుర్తించారు. ఈ మేరకు అతన్ని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సదరు వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా, విచారణ అనంతరం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది.