బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హిందూ, ముస్లింల అభ్యున్నతి కోసం మాజీ సీఎం కేసీఆర్ ఎంతో చేశారని ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని సూఫీ మసీదు ఆవరణలో ఈద్గా వద్ద రంజాన్ పండుగ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా మాజీమంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.మతాలకు అతీతంగా ఉగాది, రంజాన్ పండుగలను హిందూ ముస్లింలు సోదరభావంతో జరుపుకోవడం శుభపరిణామం అన్నారు. కొన్ని శక్తులు రెచ్చగొట్టేటు వంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకొని మతసామరస్యం చాటారని కొనియాడారు.