అకాల వర్షాలకి దెబ్బతిన్న పంటలకి ఎకరాకి 25వేల రూపాయలని నష్టపరిహారం కింద అందించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట ఆర్డిఓ కార్యాలయం ఎదుట బిజెపి ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష ని చేపట్టారు అయితే దీనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు వెంకటరమణారెడ్డి.
అకాల వర్షాలతో అన్నదాతలు నష్టపోతే రేవంత్ రెడ్డి మంత్రులు పరామర్శించిన దాఖలు ఏమీ లేవని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు నుండి పదివేల ఎకరాల్లో పంటలు నష్టం జరిగితే జిల్లా మొత్తంగా ఐదు నుండి పదివేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు అధికారులు తూతూ మంత్రంగా నివేదికలు ఇస్తున్నారని మండిపడ్డారు.