విశాఖలో కేఏ పాల్ కీలక ప్రకటన చేశారు. ఈ రోజు విశాఖను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తున్నానని తెలిపారు. వచ్చేది పాల్ ప్రభుత్వమే… అధికారంలోకి రాగానే విశాఖను ఇంటర్నేషనల్ సిటీ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు కేఏ పాల్.
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చెయ్యొద్దని సీఎం జగన్ లేఖ రాస్తే మోడీ ఎందుకు సమాధానం చెప్పలేదని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ను అమ్మటానికి మోడీ ఎవరు, చంద్రబాబు ఎవరు…? అని నిలదీశారు. మోడీ, జగన్ మన పరిశ్రమలను ఆదానికీ అమ్మేస్తున్నారు… ఎందుకంటే ఆదాని మోడీకి మంచి స్నేహితుడన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మటానికి వీలులేదని వెల్లడించారు కేఏ పాల్.