తమిళనాడులో ఒక్కేరోజు 28 నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతిచెందటం కలకలంరేపింది. ఇంత భారీ సంఖ్యలో నెమళ్లు చనిపోవడంతో స్థానికులు కూడా షాకవుతున్నారు. రాష్ట్రంలోని స్థానిక కొవిల్‌పట్టి గ్రామంలోని ఓ వ్యవసాయ పొలంలో 28 నెమళ్ళు మరణించాయి. ఈ వ్యవహారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. చనిపోయిన పక్షులను వెటర్నరీ ఆస్పత్రికి తరలించి పోస్ట్ మార్టమ్ నిర్వహించి.. వాటి మృతికి కారణాలను తెలుసుకున్నారు.
నెమళ్లు మొక్కజొన్న విత్తనాలు తినడం వల్లే జీర్ణం కాక చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పంటను కాపాడుకునేందుకు రైతులు విత్తనాల్లో పురుగు మందు కలిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.