మీరు ఇంటి రుణం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో గృహ రుణాలపై ఊరట కలిగించారు. ఇది నిజంగా మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూసే.
సొంత ఇల్లు అనేది ప్రతి మధ్యతరగతి వ్యక్తి కల. దాని కోసమని.. కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో కాస్త ఊరట కలిగించింది. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవాళ్లకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. రూ. 45 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్నవాళ్లకు 3.5 లక్షల వడ్డీ రాయితీని అందించనుంది. ఇదివరకు ఉన్న వడ్డీ రాయితీ 2 లక్షల నుంచి ఈసారి 3.50 లక్షలకు పెంచారు.