ఏపీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది 312 జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఏపీ సర్కార్ ప్రకటన చేసింది. స్కిల్ డేవలెప్మెంట్ జాబ్ మేళా క్యాలెండర్ ను ఆవిష్కరించారు సలహాదారు చల్లా మధుసూధన్ రెడ్డి, ఛైర్మన్ అజయ్ రెడ్డి, ఎండీ సత్యనారాయణ. ఈ సందర్భంగా ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ సలహాదారు చల్లా మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువతకు సరైన నైపుణ్యం అందించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టింది.. సుమారు 14 లక్షల మందికి 36 సెక్టార్స్ లో శిక్షణ ఇచ్చామన్నారు.
మల్టీ నేషనల్ కంపెనీలతో ఒప్పందాల ద్వారా మంచి నైపుణ్యం అందేలా చర్యలు తీసుకున్నాం.. ఇతర దేశాల్లో ఉన్నత విద్యను కూడా మనం శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. నియోజకవర్గ స్థాయిలో నైపుణ్యం అందించేందుకు స్కిల్ హబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. రానున్న రెండేళ్లలో 175 నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక స్కిల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయనున్నాం.. ఇప్పటికే 15 తాత్కాలిక స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేశామని చెప్పారు.