ఉపాధ్యాయుల మహాధర్నాకు మావోయిస్ట్ పార్టీ మద్దతు..

-

317 జీఓను రద్దు చేయాలని కోరుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఫిబ్రవరి 5వ తేదీన తలపెట్టిన మహా ధర్నాకు మావోయిస్ట్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈనేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరట పత్రికా ప్రకటనను విడుదల చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలనలో అప్రజాస్వామికంగా కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మూలంగా ఎందరో రైతులు,కార్మికులు,ఉద్యోగులు,ఉపాధ్యాయులు బలి అవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే రైతులు కల్తీ విత్తనాలతో,వివిధ రకాల తెగులతో పంటలు నష్టపోయి పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదోనని కుములుతున్న రైతులను అకాల వర్షాలు మరింత దెబ్బ తీశాయని…ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని.. కాస్తో కూస్తో పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదని.. చివరి గింజ వరకు కొంటామన్న ప్రభుత్వం ఒక గింజ కూడా కొనలేదని లేఖలో పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయ పద్ధతుల్లో చేసినా 317 జీఓ ద్వారా బలవంతంగా బదిలీలు చేపట్టడంతో.. స్థానికతను కోల్పుతున్నారు. భార్యభర్తలను వేరు వేరు ప్రాంతాలకు విడిగొడుతున్నారు. వితంతు మహిళలు, ఒంటరి మహిళలను దూర ప్రాంతాలకు వేయడంతో భద్రత లేకుండా పోతుంది.
5,6.వ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీలో ఆదివాసులకు కల్పించాల్సిన ఉద్యోగ అవకాశాలు వారికి చెందకుండా పోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. 317 జీవో మూలంగా కొద్ది మంది ఉపాధ్యాయులు మానసిక వేదనతో ప్రాణాలు తీసుకుంటున్నారు.ఇన్ని సమస్యలకు కారణమైనా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విరోచితంగా పోరాడాలని పిలుపునిస్తున్నాం అంటూ లేఖలో పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version