అద్భుతం.. ఇంటినే 3డి ప్రింట్ తీశారు.. ధ‌ర ఎంతో తెలుసా..?

-

రోజు రోజుకీ సాంకేతిక ప‌రిజ్ఞానం కొత్త పుంత‌లు తొక్కుతోంది. కొత్త ఇల్లు క‌ట్టాలంటే ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌ల త‌ర‌బ‌డి స‌మ‌యం ప‌ట్టేది. కానీ 3డి ప్రింటింగ్ పుణ్య‌మా అని కేవ‌లం కొద్ది రోజుల్లోనే సొంతంటి క‌ల‌ను సాకారం చేసుకునే వీలు ఏర్ప‌డింది. అవును.. ఇప్పుడు ఇళ్ల‌ను కూడా ప్రింట్ చేస్తున్నారు. అయితే అవి అల్లాట‌ప్పా ప్రింట‌ర్లు కావు.. భారీ 3డి ప్రింట‌ర్లు.

అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఎస్‌క్యూ4డి అనే కంపెనీ భారీ 3డి ప్రింట‌ర్ల స‌హాయంతో ఏకంగా ఓ ఇంటినే 3డి ప్రింటింగ్ తీసింది. ఆ ఇల్లును న్యూయార్క్‌లో ఉన్న రివ‌ర్‌హెడ్ అనే ప్రాంతంలోని 34 మిల్‌బ్రూక్ లేన్‌లో ఉంచారు. ఇక ఆ ఇంటి విస్తీర్ణం 1500 చ‌ద‌ర‌పు అడుగులు కాగా అందులో 3 బెడ్ రూమ్‌లు, 2 ఫుల్ బాత్ రూమ్‌లు ఉన్నాయి. దీంతోపాటు 2 కార్లు ప‌ట్టే సామ‌ర్థ్యం క‌లిగిన గ్యారేజీ కూడా ఆ ఇంట్లో ఉంది.

ఇక ఈ ఇంటికి 2,99,999 డాల‌ర్ల ధ‌ర‌ను నిర్ణ‌యించారు. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.2,18,91,092 అన్న‌మాట‌. ఈ క్ర‌మంలో ఇంటిని కొనుగోలు చేసే వారికి ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ కూడా ఇస్తారు. అయితే దీన్ని ప్ర‌స్తుతం ఓ వెబ్‌సైట్‌లో అమ్మ‌కానికి ఉంచారు. మ‌రి ఈ 3డి ప్రింటెడ్ ఇంటిని ఎవ‌రు కొంటారో చూడాలి. ఏది ఏమైనా 3డి ప్రింటింగ్ చేస్తున్న‌ అద్భుతాల్లో ఇదొక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version