టీడీపీ మూడో స్థానం…అదేంటి ఏపీలో బలంగా ఉన్న టీడీపీ..మూడో స్థానంలో ఉండటం ఏంటి? వైసీపీకి గట్టి పోటీ ఇస్తూ…నెక్స్ట్ అధికారం దక్కించుకోవాలని అనుకుంటున్న టీడీపీ మూడో స్థానంలో ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లోనే కొన్ని స్థానాల్లో టీడీపీ స్థానానికి పరిమితమైంది. భీమవరం, నరసాపురం, రాజోలు, గాజువాక, అరకు స్థానాల్లో టీడీపీది మూడో స్థానం.
రాజోలు సీటుని జనసేన గెలుచుకున్న విషయం తెలిసిందే…అక్కడ వైసీపీకి రెండోస్థానం వచ్చింది. ఇక వైసీపీ గెలుచుకున్న భీమవరం, నరసాపురం, గాజువాక స్థానాల్లో జనసేన రెండు, టీడీపీ మూడో స్థానం. అరకులో వైసీపీ గెలవగా, ఇండిపెండెంట్ సెకండ్, టీడీపీ థర్డ్…అసలు డిపాజిట్ కోల్పోయింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ బలపడుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన చాలా సీట్లలో టీడీపీ పికప్ అయింది. కానీ ఇప్పటికీ మూడు స్థానాల్లో టీడీపీ మూడో స్థానంలోనే ఉంది. గాజువాక, అరకు స్థానాల్లో సెకండ్ ప్లేస్‌కు వచ్చింది గాని…నరసాపురం, భీమవరం, రాజోలు స్థానాల్లో రాలేదు.
ఒకవేళ గాజువాకలో మళ్ళీ పవన్ పోటీ చేస్తే సీన్ వేరేగా ఉంటుంది. పవన్ పోటీ చేయకపోతే మాత్రం ఇక్కడ వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇస్తుంది. అరకులో గెలిచెంత సీన్ రాలేదు గాని..కాకపోతే సెకండ్ ప్లేస్‌లో ఉంది. అయితే భీమవరంలో వైసీపీ-జనసేనల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. నెక్స్ట్ భీమవరంలో పవన్ పోటీ చేస్తే జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీకి మూడో స్థానమే.
గత ఎన్నికల్లో నర్సాపురంలో వైసీపీకి దాదాపు జనసేన చెక్ పెట్టేసినంత పనిచేసింది. కానీ తక్కువ మెజారిటీతో ఓడిపోయింది. ఈ సారి వైసీపీకి చెక్ పెట్టేలా ఉంది. జనసేన-వైసీపీ పోరులో టీడీపీ ఇక్కడ మూడో స్థానమే. రాజోలులో కూడా అదే పరిస్తితి. గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్…వైసీపీ వెళ్లారు. అయినా సరే ఇక్కడ జనసేన బలం తగ్గలేదు..ఇంకా పెరిగింది. నెక్స్ట్ వైసీపీ-జనసేన మధ్యే పోరు నడవనుంది. మళ్ళీ ఇక్కడ టీడీపీకి మూడో స్థానమే.