ఆఖరి టీ20లో ఆస్టేలియా భారీ స్కోర్..ఇండియా టార్గెట్ 187

-

చివరి మ్యాచ్‌లో గెల్చి, టీట్వంటీ సిరీస్ క్లీన్‌ స్వీప్‌ చేయాలనుకున్న కోహ్లీసేనకు భారీ టార్గెట్ ముందుంచింది ఆస్ట్రేలియా. ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ ,ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ చెలరేగడంతో మూడో టీ20లో ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ముందుగా టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ ఏంచుకొని ఆసీస్‌ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్కోరును పెంచే ప్రయత్నంలో వేడ్‌, మ్యాక్స్‌వెల్‌ అవుటవడం.. చివరి రెండు ఓవర్లు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్‌ చేయడంతో ఆసీస్‌ 20 ఓవర్లలో 186 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ముగించింది.

గత మ్యాచ్ లో 190 పరుగుల టార్గెట్ ను అలవోకగా చేదించడం ఆటగాళ్లందరు ఫామ్ లో ఉండటం టీమిండియాకి బిగ్ ఎస్సెట్ గా చెప్పోచ్చు. బ్యాటింగ్ విషయానికొస్తే రోహిత్, జడేజా గైర్హాజరీలోనూ టీమిండియా అత్యంత పటిష్ఠంగా ఉంది. కేఎల్ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య సూపర్‌ ఫామ్‌లో ఉండటం, శిఖర్‌ ధావన్‌, విరాట్ కోహ్లీ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం భారత్‌కు కలిసొస్తోంది. సంజు శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ భారీ షాట్లు ఆడుతూ స్కోరును ఉరకలెత్తిస్తున్నారు.ఇవాళ్టి మ్యాచ్‌లోనూ భారత బ్యాట్స్‌మెన్ సమష్టిగా పోరాడితే ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version